News

మదనపల్లి ఫైల్స్ కేసులో ముగ్గురు అధికారుల సస్పెన్షన్

మదనపల్లిలో ఫైల్స్ దహనం కేసులో ముగ్గురు అధికారులను అనుమానిస్తూ ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. సబ్ కలెక్టర్ కార్యాలయంలోని రెవెన్యూ దస్త్రాల దహనం విషయంలో పూర్వ ఆర్డీవో మురళి, ప్రస్తుత ఆర్డీవో హరిప్రసాద్, సీనియర్ ఆసిస్టెంట్ గౌతమ్‌ను సస్పెండ్ చేశారు. రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోదియా ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కేసులో మాజీ మంత్రి పెద్ది రెడ్డి, ఆయన కుమారుడు మిథున్ రెడ్డి పాత్ర ఉందని అనుమానిస్తున్నారు. వారి అనుచరులను పోలీసులు విచారిస్తున్నారు. ఇది యాక్సిడెంట్‌గా జరిగింది కాదని, ఒక పథకం ప్రకారం జరిగి ఉండొచ్చని డీజీపీ ద్వారకా తిరుమల రావు ప్రకటించిన సంగతి తెలిసిందే.