ఏసిబి కస్టడీకి సస్పెన్షన్ ఏఈఈ
ఇండియన్ ఏసిబి కేసుల హిస్టరీలోనే అతి ఖీరీదైన నాన్ ఎగ్జిక్యూటివ్ కరప్షనిస్ట్ కేస్ గా సంచలనం సృష్టించిన తెలంగాణ నీటిపారుదల శాఖ సస్పెన్షన్ ఏఈఈ వ్యవహారంలో ఏసిబి కోరిన మేరకు 4 రోజుల పాటు కస్టడీకి హైకోర్టు అనుమతించింది.చంచల్‌గూడ జైలు లో రిమాండ్ ఖైదీగా ఉన్న నిఖేష్ కుమార్‌ను ఏసిబి ఇవాళ కస్టడీకి తీసుకుంది.దాదాపు రూ.500కోట్లకు పైగా అక్రమ స్థిర,చరాస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణలతో పాటు ఏసిబి రైడ్స్‌లో వెలుగు చేసిన ప్లాటినం,బంగారం,డైమండ్ నగల అక్రమ నిల్వల గుర్తింపు నేపథ్యంలో నిఖేష్‌పై కేసు నమోదైంది.అయితే మరింత సమాచారం రాబట్టి ఆక్రమాస్తుల చిట్టా గుట్టు విప్పేందుకు ఏసిబి ఆయన్ను కస్టడీకి కోరింది.దీంతో కోర్టు వెంటనే అనుమతించింది.

