ఢిల్లీ సీఎం పదవిపై వీడని సస్పెన్స్..
ఢిల్లీ ఎన్నికల ఫలితాలు విడుదలై పదిరోజులు కావస్తున్నా ఇంకా సీఎం, ఇతర మంత్రులపై సస్పెన్స్ వీడలేదు. ఢిల్లీ కాబోయే ముఖ్యమంత్రి విషయంలో నేడు బీజేపీ సమావేశంలో స్పష్టమైన ప్రకటన వస్తుందని భావించారు. అయితే ఈ రోజు జరగాల్సిన భేటీని వాయిదా వేశారు. కేబినెట్ కూర్పు, సీఎం పదవిపై రేపు సమాలోచనలు జరుగుతాయని సమాచారం. మూడు దశాబ్దాల తర్వాత ఢిల్లీ పీఠం బీజేపీ వశమవడంతో ఆచి, తూచి వ్యవహరిస్తోంది. ఢిల్లీకి ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు ఉండొచ్చనే ప్రతిపాదనను అంగీకరిస్తారని, పవర్‌ఫుల్ వ్యక్తికే ఢిల్లీ సీఎం పదవి దక్కుకుందని అధిష్టానం చూచాయిగా తెలియజేసింది. ఫిబ్రవరి 19న సమావేశం జరిగితే, ఆ మరుసటి రోజే ప్రమాణ స్వీకారం ఉండొచ్చు. ఢిల్లీ రామ్ లీలా మైదానంలో ప్రధాని సహా, బీజేపీ అగ్రనేతల సమక్షంలో ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుంది.