సూర్యకుమార్ యాదవ్‌ను తీసేయాలి
ముంబై బ్యాటర్ సూర్య కుమార్ యాదవ్‌పై నెటిజన్లు మండిపడుతున్నారు. సూర్యకుమార్ యాదవ్ T20ల్లో వరల్డ్ నెం.1గా కొనసాగుతున్నప్పటికీ.. వన్డేల్లో మాత్రం విఫలం అవుతున్నాడు.ఇప్పటివరకు AUSతో జరిగిన తొలి రెండు వన్డేల్లో సూర్య డకౌట్ అయ్యాడు.దీంతో అతన్ని పక్కనబెట్టి సంజూ శాంసన్‌ను తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. అంతేకాకుండా సూర్యను కేవలం T20లకే పరిమితం చేయాలంటున్నారు. కాగా సూర్యకుమార్ యాదవ్ ఇప్పటివరకు జరిగిన 22 వన్డేల్లో 433 రన్స్ చేశాడు. అయితే దీని యావరేజ్ కేవలం 25.47గా ఉంది. గతంలో ఆడిన 10 వన్డేల్లో ఈ ముంబై బ్యాటర్ హాఫ్ సెంచరీ చేయకపోవడం గమనార్హం. దీంతో సూర్యకుమార్ ఆట పట్ల పలువురు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.