జగన్ ఇంటివద్ద నిఘా నేత్రాలు
తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయం, వైసీపీ అధినేత జగన్ నివాసం వద్ద ఏపీ పోలీస్ పఠిష్టమైన నిఘా ఏర్పాటు చేసింది. జగన్ నివాసం వద్ద ఎదురుగా ఉన్న గార్డెన్‌లో ఇటీవల మంటలు చెలరేగిన సంగతి తెలిసిందే. దీనిపై విచారణకు ఆదేశించిన ప్రభుత్వం జగన్ ఇల్లు, కార్యాలయం వద్ద సీసీ టీవీ ఫుటేజ్ కోరగా వారు స్పందించలేదని పేర్కొన్నారు. ఈ క్రమంలో పోలీసులు ఇక్కడ 8 సీసీ కెమెరాలను అమర్చారు. దీనిని తాడేపల్లి పోలీస్ స్టేషన్‌కు అనుసంధానించారు. మంటలు చెలరేగిన ప్రాంతంలో మట్టి, బూడిద నమూనాలను సేకరించి, పరీక్ష కోసం ల్యాబ్‌కు పంపారు. వాటి నివేదికలు వస్తే, దీనికి గల కారణాలు తెలుస్తాయని ఆశిస్తున్నారు.