Home Page SliderNational

లొంగిపో, లేదా నా కోపాన్ని చూడాల్సి వస్తుంది, మనవడు ప్రజ్వల్ రేవణ్ణతో దేవెగౌడ

మనమడు ప్రజ్వల్ రేవణ్ణ తక్షణం లొంగిపోవాలని ఆయన తాత, మాజీ ప్రధాని దేవెగౌడ బహిరంగ లేఖ రాశారు. లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రజ్వల్ రేవణ్ణ దేశవ్యాప్తంగా విమర్శలపాలయ్యారు. లైంగిక వేధింపులు, లైంగిక దుశ్చర్యలు, మహిళలతో సెక్స్ జరుపుతూ బలవంతంగా వీడియోలు తీయడం వంటి నేరారోపణలు ఎదుర్కొంటున్నాడు. లొంగిపో, లేదంటే కుటుంబం కోపాన్ని ఎదుర్కోవాల్సి వస్తోందని దేవెగౌడ లేఖలో పేర్కొన్నారు. ప్రజ్వల్‌కు ఆయన గట్టి హెచ్చరిక చేశారు. తీవ్రమైన లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న 33 ఏళ్ల ప్రజ్వల్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించారు. “మే 18న పూజ కోసం గుడికి వెళుతున్నప్పుడు ప్రజ్వల్ రేవణ్ణ గురించి మీడియాతో మాట్లాడాను. అతను నాకు, నా కుటుంబానికి, నా సహోద్యోగులకు, స్నేహితులకు తీవ్ర మనోవేదన కలిగించాడు. ఆ షాక్, బాధ నుండి కోలుకోవడానికి కొంత సమయం పట్టింది. నా కొడుకు, కర్నాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డి కుమారస్వామి ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చినప్పటి నుంచి చట్ట ప్రకారం కఠినంగా శిక్షించాలని కోరారు. హాసన్‌లో పోలింగ్ ముగిసిన ఒక రోజు తర్వాత, ఏప్రిల్ 27న ప్రజ్వల్ జర్మనీకి పారిపోయాడు. ఆరోపణలు వెల్లువెత్తడానికి కొద్ది రోజుల ముందు ఆయన హఠాత్తుగా వెళ్లిపోవడం అనుమానాలకు తావిస్తోంది. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) ఆదేశాల మేరకు ఇంటర్‌పోల్ బ్లూ కార్నర్ నోటీసు జారీ చేసింది. ప్రత్యేక కోర్టు నుండి అరెస్ట్ వారెంట్ ఉంది. లేఖలో దేవెగౌడ బాధ, ఆవేదన స్పష్టంగా ఉన్నాయి. ప్రజ్వల్ దోషిగా తేలితే, కఠినమైన చట్టపరమైన శిక్షలను ఎదుర్కోవాల్సి ఉంటుందని కుటుంబం భావిస్తోంది.

దేవెగౌడ లేఖ ప్రజ్వల్‌కు తీవ్ర అల్టిమేటంతో ముగుస్తుంది. ఈ ఆదేశాన్ని పాటించడంలో విఫలమైతే ప్రజ్వల్ తన కుటుంబం ఆగ్రహాన్ని ఎదుర్కొంటాడని, పూర్తిగా ఒంటరవుతాడని దేవెగౌడ హెచ్చరించాడు. న్యాయపరమైన విచారణలో తానుగానీ, కుటుంబసభ్యులుగానీ జోక్యం చేసుకోబోమని ప్రమాణం చేశారు. “ఈ తరుణంలో నేను ఒక్కటే చేయగలను. ప్రజ్వల్‌కి గట్టి వార్నింగ్ ఇస్తాను. ఎక్కడ ఉన్నా తిరిగి వచ్చి పోలీసుల ముందు లొంగిపోవాలని కోరుతున్నా. చట్టపరమైన ప్రక్రియకు లోబడి ఉండాలి. ఇది అప్పీల్ కాదు. నేను చేస్తున్న హెచ్చరిక. ఈ హెచ్చరికను పట్టించుకోకపోతే, వచ్చిన ఆరోపణలను చట్టం చూసుకుంటుంది. కుటుంబ సభ్యులందరి చెప్పేది వినడం వల్ల మర్యాద దక్కుతుంది. నాపై గౌరవం ఉంటే వెంటనే తిరిగి రావాలి’ అని దేవెగౌడ లేఖలో పేర్కొన్నారు.

ఈ కుంభకోణంపై వివిధ వర్గాల నుంచి తీవ్ర స్పందన వ్యక్తమైంది. కర్ణాటకలోని 100 మందికి పైగా మేధావులు ప్రజ్వల్‌ను తక్షణమే అరెస్టు చేయాలని ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు వినతిపత్రం అందించారు. జెడిఎస్ ఎమ్మెల్యే హెచ్‌డి రేవణ్ణ కూడా వేధింపులు, కిడ్నాప్ కేసుల్లో నిందితుడిగా ఉన్నారు. ఈ నెల ప్రారంభంలో అరెస్టైనా, బెయిల్‌పై బయట ఉన్నాడు. సాక్షులకు రక్షణ కల్పించాలని వారు డిమాండ్ చేశారు. ప్రజ్వల్ తప్పించుకోవడానికి సహకరించిన వారిపై కూడా విచారణ జరిపించాలని కోరారు. దేశం విడిచి పారిపోవడానికి ఉపయోగించిన ప్రజ్వల్ దౌత్య పాస్‌పోర్ట్‌ను రద్దు చేసేందుకు సత్వర చర్యలు తీసుకోవాలని కోరుతూ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రధాని నరేంద్ర మోదీకి పలు లేఖలు రాశారు. ఇన్ని విజ్ఞప్తులు చేసినా కేంద్ర ప్రభుత్వం నుంచి చెప్పుకోదగ్గ స్పందన లేదు. ఆరేళ్లుగా తన నివాసంలో ఇంట్లో పనిమనిషిగా పనిచేస్తున్న తన తల్లిని కిడ్నాప్ చేశాడని ఓ వ్యక్తి ఆరోపించాడు. ప్రజ్వల్ రేవణ్ణ తన తల్లిపై లైంగిక వేధింపులకు పాల్పడి, చిత్రీకరించిన వీడియో ఇటీవల బయటపడిందని, ఆ తర్వాత ఆమె అదృశ్యమైందని నిందితుడు పేర్కొన్నాడు. దీంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.