ఉచిత హామీలపై సుప్రీం ఫైర్
రాజకీయ నాయకులు ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చే ఉచితాలపై సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది.. ఎన్నికల్లో ఉచితాలు ప్రకటించడాన్ని ధర్మాసనం పూర్తిగా తప్పుబట్టింది. పట్టణ ప్రాంతాల్లో నిరాశ్రయులకు ఆశ్రయం కల్పించాలంటూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ అగస్టీన్ జార్జ్ బెంచ్ పై విధంగా స్పందించింది. ఉచిత రేషన్, ఉచితంగా నగదు అందుతున్నందున ప్రజలు పనిచేయడానికి ఇష్టపడడం లేదని వ్యాఖ్యానించింది. ఉచితాలతో ఏ పని చేయకుండానే ఆహారం, డబ్బు సంపాదిస్తున్నారని ధర్మాసనం పేర్కొంది.

