కవిత పిటిషన్‌పై సుప్రీం కీలక వ్యాఖ్యలు..
ప్రస్తుతం దేశంలో ఢిల్లీ లిక్కర్ స్కాం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ కేసులో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. మరోవైపు ఇప్పటికే కవితను ఈడీ 3 సార్లు విచారించింది. ఇదిలా వుంచితే, మహిళను విచారించే విధానంపై ఈడీకి తగిన మార్గదర్శకాలను ఇవ్వాలని కోరుతూ సుప్రీంకోర్టులో కవిత పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను ఈనెల 24న విచారిస్తామని ఇంతకు ముందు చీఫ్ జస్టిస్ ధర్మాసనం తెలిపింది. అయితే.. విచారణ తేదీని తాజాగా 27కి మార్చింది. ఈ నెల 27న జస్టిస్ అజయ్ రస్తోగి, బేలా త్రివేదీల ధర్మాసనం పిటిషన్‌ను విచారించనుంది. అయితే.. ఈలోగా కవితను ఈడీ మరోసారి విచారణకు పిలవొచ్చనే చర్చ మొదలైంది. మరోవైపు ఈడీ విచారణకు కవిత హాజరైన ప్రతిసారీ ఆమెను అరెస్ట్ చేస్తారనే ప్రచారం జరిగింది. మొత్తానికి చూస్తే.. డిల్లీ లిక్కర్ స్కాం దేశ వ్యాప్తంగా ఉత్కంఠను రేకెత్తిస్తోంది.

