Home Page SliderNational

నీట్ పేపర్ లీక్‌పై సుప్రీంకోర్టు కీలక తీర్పు

నీట్ పేపర్ లీకేజీపై సుప్రీంకోర్టులో వాదనలు ఎట్టకేలకు ముగిశాయి.ఈ కేసులో ఇరు పక్షాల వాదనలు విన్న సీజేఐ నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ అయ్యిందని తేల్చి చెప్పింది. అయితే  మరోసారి నీట్ ఎగ్జామ్ నిర్వహించాల్సివ అవసరం లేదని స్పష్టం చేసింది.మరోసారి నీట్ ఎగ్జామ్ నిర్వహిస్తే 24 లక్షల మందికి ఇబ్బంది కలుగుతుందని ధర్మాసనం తెలిపింది.కాగా నీట్ ఎగ్జామ్‌లో కాపీ కొట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ధర్మాసనం ఆదేశించింది. బీహార్‌లోని హజారీబాగ్,పాట్నాలోనే పేపర్ లీకైందని సుప్రీం పేర్కొంది.ఈ పేపర్ లీక్‌తో 155 మంది విద్యార్థులకు మాత్రమే లబ్ధి చేకూరిందని తెలిపింది. కానీ దేశమంతా నీట్ పేపర్ లీక్ కాలేదని సీజేఐ వెల్లడించారు.అయితే నీట్ పరీక్ష నిర్వహణలో లోపాలున్నాయని వెల్లడించింది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా నీట్ కౌన్సిలింగ్‌ యధావిధిగా కొనసాగనుంది.