Andhra PradeshHome Page Slider

ఎర్ర గంగిరెడ్డి బెయిల్ ఉత్తర్వుపై ఆశ్చర్యపోయిన సుప్రీంకోర్టు

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఏ-1 ముద్దాయి ఎర్రగంగిరెడ్డికి తెలంగాణా హైకోర్టు బెయిల్ ఇవ్వడం, మళ్లీ రద్దు చేయడంపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ చాలా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. బెయిల్ అసలు ఎందుకు ఇచ్చారంటూ స్పందించారు. గంగిరెడ్డికి బెయిల్ ఇచ్చిన అనంతరం వివేకా కుమార్తె సునీత సునీత సుప్రీంకోర్టులో సవాలు చేశారు. సీబీఐ కూడా గంగిరెడ్డి బయట ఉండడం వల్ల కేసు దర్యాప్తుకు అంతరాయం కలుగుతుందని ఆరోపించింది. దీనితో తెలంగాణా హైకోర్టు మళ్లీ బెయిల్ రద్దు చేస్తూ తీర్పు ఇచ్చింది. ఈ బెయిల్ రద్దు విషయంలో హైకోర్టు జూన్ 30 తర్వాత బెయిల్ ఇవ్వాలని సీబీఐ అధికారులను ఆదేశించింది. దీనితో ఇదేం ఉత్తర్వులంటూ మండిపడ్డారు సీజేఐ చంద్రచూడ్. ప్రతివాదులకు నోటీసులు జారీ చేస్తూ విచారణను వెకేషన్ బెంచ్‌కు బదిలీ చేసింది.