Home Page Sliderhome page sliderNational

అశ్లీల కంటెంట్ పై సుప్రీం సీరియస్

ఓటీటీలు, సోషల్ మీడియాలో అశ్లీల కంటెంట్ ప్రసారంపై సుప్రీం కోర్టులో ఇవాళ విచారణ జరిగింది. కేంద్రంతో పాటు పలు ఓటీటీలు, సోషల్ మీడియా హ్యాండిళ్లకు సర్వోన్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, ఉల్లు, ఆల్ టి ఓటీటీలకు.. ఎక్స్, ఫేస్ బుక్, ఇన్ స్ట్రా, యూట్యూబ్ లకు నోటీసులిచ్చింది. ఓటీటీలు, సోషల్ మీడియాలో అశ్లీల కంటెంట్ ను అడ్డుకోవాలని సుప్రీంలో పిల్ దాఖలైంది. ఈ పిల్ ను ఇవాళ విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు వాదనల సందర్భంగా అశ్లీల కంటెంట్ పై చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.