Home Page SliderNationalNewsNews Alert

ఆధార్ కార్డుపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు

వయసు నిర్ధారణకు ఆధార్ కార్డ్ చెల్లదని సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. స్కూల్ సర్టిఫికెట్లను ప్రామాణికంగా తీసుకోవాలని స్పష్టం చేసింది. వయసు నిర్ధారణకు ఆధార్‌ను ప్రామాణికంగా తీసుకుంటూ పంజాబ్, హర్యానా హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టేసింది. రోడ్డు ప్రమాదంలో చనిపోయిన వ్యక్తి తరఫు కుటుంబానికి పరిహారం నిర్ణయించేందుకు ఆధార్‌ను ప్రామాణికంగా తీసుకోవడంతో నష్ట పరిహారం తగ్గడంతో ఆ కుటుంబం కోర్టు మెట్లు ఎక్కింది, తదుపరి పిటిషన్ దాఖలు చేసింది.