బాలయ్యకు సుప్రీం షాక్
నందమూరి నాయకుడు, హీరో, హిందూపూర్ ఎమ్మెల్యే బాలయ్య బాబుకి సుప్రీంకోర్టు జలక్ ఇచ్చింది. ఆయన నటించిన 100 వ చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాకు సంబంధించి ఈ నోటీసులు అందాయి. ఈ సినిమాకు పన్ను రాయితీ తీసుకుని కూడా టికెట్ రేట్లు తగ్గించలేదని సినీ ప్రేక్షకుల వినియోగదారుల సంఘం గతంలో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పన్ను రాయితీని ప్రేక్షకులకు బదలాయించలేదని, అందువల్ల ఆ రాయితీ మొత్తాన్ని తిరిగి ప్రభుత్వానికి రికవరీ చేయాలని పిటిషన్‌లో విజ్ఞప్తి చేసారు. ఈ కేసును విచారించిన సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వై. చంద్ర చూడ్ ప్రతివాదులందరికీ నోటీసులు జారీ చేసారు.

బాలకృష్ణతో సహా అప్పటి తెలంగాణా, ఏపీ ప్రభుత్వాలకు కూడా నోటీసులు జారీ అయ్యాయి. అప్పట్లో ఏపీ ప్రభుత్వం చాలా సినిమాలకు పన్ను రాయితీలు ఇచ్చారని, కానీ సినీ ఇండస్ట్రీ, జనాలకు రాయితీను బదలాయించలేదని పిటిషినర్ ఆరోపించారు.