Home Page SliderNational

నీట్ లీకేజ్‌పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

నీట్ పరీక్ష,లీకేజ్, ఫలితాలపై సుప్రీం కోర్టు నేడు విచారణ చేపట్టింది. విచారణలో భాగంగా కీలక వ్యాఖ్యలు చేసింది. నీట్ పరీక్ష నిర్వహణ పారదర్శకంగా జరగలేదని వ్యాఖ్యానించింది. లీకేజ్ జరిగిన మాట వాస్తవమే అని తేల్చింది. ఈ లీకైన పేపరు ఎంతమందికి చేరిందో పూర్తి వివరాలు నివేదించాలని ఆదేశించింది. ఈ పరీక్ష రాసిన 23 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తుతో సంబంధం ఉన్న అంశమని, దీనిని పూర్తిగా విచారణ జరపకుండా తీర్పులు ఇవ్వడం సాధ్యం కాదని పేర్కొంది. అన్ని అంశాలనూ జాగ్రత్తగా పరిశీలించిన తర్వాతే ఈ విషయంపై తీర్పు ఇస్తామని పేర్కొంది. ఇది కేవలం ఇద్దరు విద్యార్థులకే సంబంధం ఉందంటున్నారనే వాదనతో కోర్టు ఏకీభవించలేదు.