ఇకపై సుప్రీంకోర్టు విచారణలు ప్రత్యక్ష ప్రసారం
రెండేళ్ల క్రితం తీసుకున్న సుప్రీంకోర్టు విచారణల ప్రత్యక్ష ప్రసారం నిర్ణయాన్ని త్వరలో అమలు చేయనున్నారు. నిజానికి 2018లోనే ఈ నిర్ణయం తీసుకున్నా కొన్ని కారణాల రీత్యా అమలు కాలేదు. ఇకపై ఒక యాప్ ద్వారా సుప్రీంకోర్టులో జరుగుతున్న అన్ని కేసుల విచారణను లైవ్ స్ట్రీమింగ్ చేయాలనే నిర్ణయం తీసుకున్నారు. ఈ యాప్‌ను ప్రయోగాత్మకంగా పరిశీలించారు. రెండేళ్ల క్రితం రాజ్యాంగ ధర్మాసనం కేసుల విచారణ యూట్యూబ్ వేదికగా ప్రసారం జరుగుతోంది. మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి. రమణ పదవీ విరమణ రోజు ధర్మాసనం కార్యకలాపాలను దేశ ప్రజలంతా వీక్షించేలా ఏర్పాట్లు చేశారు. ఈ చారిత్రక నిర్ణయంతో ఆర్టికల్ 370 రద్దు, పౌరసత్వ సవరణ చట్టం వంటి కేసుల విచారణను దేశ ప్రజలు వీక్షించారు. ఇప్పుడు ఈ యాప్ రూపంలో అన్ని కేసులకూ సంబంధించిన విచారణలు లైవ్ స్ట్రీమింగ్ జరుగుతాయని పేర్కొన్నారు.