Home Page SliderNational

నేడు నీట్-యూజీ పరీక్షలపై సుప్రీంకోర్టులో విచారణ

ఈ రోజు సుప్రీంకోర్టు నీట్-యూజీ పరీక్షలపై విచారణ చేపట్టనుంది.కాగా దేశంలో నీట్ పేపర్ లీక్ నేపథ్యంలో రీ టెస్ట్ కోరుతూ పిటిషన్లు దాఖలైన విషయం తెలిసిందే. అన్ని పిటిషన్లపై సుప్రీంకోర్టు నేడు విచారణ జరపనుంది.అయితే పేపర్ లీకేజీ జరిగిందన్న విషయంలో స్పష్టత ఉందని ధర్మాసనం పేర్కొంది.  కాగా రీటెస్ట్ అనేది చివరి ఆప్షన్ మాత్రమేనని సుప్రీంకోర్టు వెల్లడించింది.ఈ మేరకు సుప్రీంకోర్టు ఇవాళ రీటెస్ట్ కోరుతున్న పిటిషనర్ల వాదనలు విననుంది. కాగా సుప్రీం ప్రతివాదుల  వాదనలు విని దీనిపై నేడు తీర్పు వెల్లడించే అవకాశం ఉంది.