‘ఆధారాలు లేకుండా అభియోగాలా?’.. ఈడీకి సుప్రీం కోర్టు సూటి ప్రశ్న
ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్‌పై (ఈడీ) కొందరిపై ఆధారాలు లేని అభియోగాలు మోపుతోందని సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఈడీపై తమకు చాలా ఫిర్యాదులు వచ్చాయని ప్రశ్నలు సంధించింది. రూ.2 వేల కోట్ల మద్యం కుంభకోణానికి చెందిన మనీ లాండరింగ్ కేసులో నిందితుడి బెయిల్ పిటిషన్ విచారణలో భాగంగా ఈ కామెంట్ చేసింది. ఆ వ్యక్తి రూ.40 కోట్లు సంపాదించారని ఆరోపించింది. కానీ అతనికి ఏ కంపెనీతో సంబంధం ఉందనేది చెప్పలేకపోతున్నారని మండిపడింది. ఇదే కేసులో 3 ఛార్జిషీట్లు దాఖలు చేశారు. కస్టడీలో ఉంచి విచారణనే శిక్షగా మార్చారు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఇటీవల ఛత్తీస్‌గఢ్ మద్యం కుంభకోణంతో రాష్ట్ర ఖజానాకు భారీ నష్టం వాటిల్లిందని ఆరోపణలు ఉన్నాయి. మద్యం సిండికేట్‌కు రూ.రెండువేల కోట్ల లబ్ది చేకూరిందని ఈడీ పేర్కొంది. మాజీ సీఎం భూపేశ్ భగేల్, ఆయన కుమారుని నివాసంలో సోదాలు జరిపింది.