NewsNews AlertTelangana

తెలంగాణా పై మండిపడ్డ సుప్రీంకోర్టు

ఆంధ్రప్రదేశ్ విభజన అనంతరం ఆంధ్ర నుండి రిలీవ్ అయిన 84 మంది విద్యుత్ ఉద్యోగులకు ఇప్పటికీ పోస్టింగ్ ఇవ్వకపోవడంపై తెలంగాణా ప్రభుత్వంపై సుప్రీంకోర్టు  మండిపడింది. విద్యుత్ శాఖ అధికారులు కోర్టు ఆదేశాలను ధిక్కరిస్తున్నారని, వారికి జైలుశిక్ష పడాల్సి ఉందని వ్యాఖ్యానించింది. ఏపీ నుంచి వచ్చిన వారికి తక్షణమే పోస్టింగ్ ఇవ్వాలని, ఇదే చివరి అవకాశమని హెచ్చరించింది. రెండు వారాల్లో జస్టిస్ ధర్మాధికారి నివేదికను అమలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఉద్యోగుల జీవితాలతో ఆడుకోవద్దని అసహనం వ్యక్తం చేసింది.