శ్రీవారి సేవలో జస్టిస్ ఎన్వీ రమణ
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారి దర్శనం చేసుకున్నారు. ఆయనకు TTD చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి స్వాగతం పలికారు. తెలంగాణా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉజ్జల్ భూయాన్ కూడా కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు. అర్చకులు వారికి వేదాశీర్వచనం చేసారు. అనంతరం తీర్థప్రసాదాలను అందజేసారు.


