ఉత్తరఫిలిఫైన్స్‌ను వణికించిన సూపర్ టైఫూన్స్
అతి శక్తివంతమైన సూపర్ టైఫూన్స్ మంగళవారం నాడు ఉత్తర ఫిలిఫైన్స్ ప్రజలను వణికించాయి. దాదాపు 10 అడుగుల ఎత్తు సముద్రపు అలలు ఎగసి పడ్డాయి. వీటితో పాటు భారీ వర్షాలు, భారీ సముద్రపు అలలు ఏర్పడి సముద్ర ప్రయాణం ప్రమాదకరంగా మారడంతో తాత్కాలికంగా సముద్రప్రయాణంపై నిషేధాలు విధించారు. దీనితో సముద్రప్రాంతాలలోని వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరిలించారు. కాగయన్, బటనెస్ ప్రావిన్స్‌కు ఈ అల్పపీడనం వాయువ్య దిశగా ఈ డోక్సురి తుఫాను కేంద్రీకృతమై ఉందని భావిస్తున్నారు. ఈ టైఫూన్ 680 కిలోమీటర్లు వెడల్పుతో వ్యాపించి ఉందని సమాచారం. దీనివల్ల ఆకస్మిక వరదలు, కొండ చరియలు విరిగిపడే అవకాశం ఉందని వారు ఆదేశ వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ డోక్సురి తుఫాన్ వల్ల సీజనల్ వర్షాలు సెంట్రల్ అండ్ నార్తన్ ప్రావిన్స్‌లో వచ్చే అవకాశాలున్నాయి. ఇవి తైవానికు దక్షిణ దిశగా ప్రయాణం కొనసాగిస్తున్నాయి. త్వరలో చైనా వరకూ వ్యాపించే అవకాశాలున్నాయి. దీనివల్ల 11 సముద్రతీర ప్రాంతాలలో ముందు జాగ్రత్త చర్యలు చేపడుతున్నారు