Andhra PradeshHome Page Slider

కడపలో రూ.125 కోట్లతో సూపర్ స్పెషాలిటీ హాస్పటల్

వైయస్సార్ జిల్లాలోని కడపలో రిమ్స్ ప్రాంగణంలో కొత్తగా సూపర్ స్పెషాలిటీ హాస్పటల్‌ను ఏపీ ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించారు. ఈ ఆసుపత్రి రూ.125 కోట్లతో నిర్మించారు. ఈ ఆసుపత్రిలో 452 పడకలు ఉన్నాయి. దీనితో పాటు రూ.40 కోట్లతో ఏర్పాటు చేసిన 100 పడకల మానసికి వైద్యశాలను కూడా నిర్మించారు. రూ.107 కోట్లతో నిర్మించిన 100 పడకల కాన్సర్ ఆసుపత్రిని ప్రారంభించి వాటిని జాతికి అంకితమిచ్చారు. వీటితో పాటు ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రిని కూడా నేడు ప్రారంభించనున్నారు.