బక్కచిక్కిపోయిన సునీతా విలియమ్స్..అభిమానుల ఆందోళన
అంతరిక్ష కేంద్రంలో ఉన్న ప్రముఖ వ్యోమగామి సునీత విలియమ్స్ తాజాగా పంపిన ఫోటో ఆందోళన కలిగిస్తోంది. ఈ ఫోటోలో ఆమె బక్కచిక్కిపోయి కనిపించారు. 8 రోజుల పని కోసం అంతరిక్ష కేంద్రాలకు వెళ్లిన సునీత వ్యోమనౌకలో హీలియం లీకేజి కారణంగా సాంకేతిక సమస్యలు రావడం వల్ల 2025 ఫిబ్రవరి వరకూ ఉండాల్సి వస్తోంది. ఈ ఫోటోలో ఆమె చాలా సన్నంగా కనిపించడంతో ఆమె పోషకాహార లోపానికి గురైనట్లు డాక్టర్లు చెప్తున్నారు. వ్యోమగాములు తమ ఆరోగ్యం కాపాడుకోవడానికి రోజుకు కనీసం 2.5 గంటలు వ్యాయామం చేయాలని సూచించారు. అంతరిక్షంలో ఉన్నవారికి స్పేస్ ఎనీమియా వచ్చే అవకాశాలు ఉంటాయని నిపుణులు చెప్తున్నారు. దీనికారణంగా ఎర్రరక్తకణాలు తగ్గిపోతాయి. దీనికారణంగా హృదయ సమస్యలు ఏర్పడతాయని ఆందోళన చెందుతున్నారు.