Home Page SliderNews AlertTelangana

సునీల్‌ కనుగోలుకు  హైకోర్టులో చుక్కెదురు

కాంగ్రెస్‌ వ్యూహకర్త సునీల్‌ కనుగోలుకు తెలంగాణ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. సైబర్‌ క్రైం పోలీసుల ఎదుట హాజరు కావల్సిందేనని సునీల్‌ కనుగోలుకు ఉన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. పోలీసుల విచారణకు సహకరించాలని కోర్టు కోరింది. ఈ నెల 8వ తేదీన విచారణకు హాజరు కావాలని సునీల్‌ కనుగోలును హైకోర్టు ఆదేశించింది. అయితే.. తెలంగాణ గళం పేరుతో సోషల్‌ మీడియాలో సర్య్యులేట్‌ అయిన మీమ్స్‌ వీడియోల కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఆ పార్టీ వ్యూహకర్త సునీల్‌ కనుగోలుకు సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు సీఆర్పీసీ 41(ఏ)కింద ఇటీవల నోటీసులు జారీ చేసింది. సునీల్‌ కనుగోలు విచారణకు హాజరు కావాలని నోటీసులో పేర్కొన్నారు. ఒకవేళ విచారణకు రాకపోతే అరెస్టు సహా ఇతర చర్యలు తీసుకుంటామని నోటీసుల్లో పోలీసులు స్పష్టం చేశారు. దీంతో సునీల్‌ హైకోర్టుకు వెళ్లారు. సీఆర్పీసీ 41(ఏ) సెక్షన్‌ కింద ఇచ్చిన నోటీసుపై స్టే ఇవ్వాలని హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ రోజు విచారణ జరిపిన హైకోర్టు … కఛ్చితంగా పోలీసుల ఎదుట విచారణకు హాజరు కావాలని స్పష్టం చేసింది.