ఐపీఎల్ ప్లేయర్‌పై సుందర్ పిచాయ్ పోస్ట్..
గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్‌కు క్రికెట్ అంటే ఎంతిష్టమో అందరికీ తెలిసిందే. ఎప్పుడు క్రికెట్ ఆడే అవకాశం వచ్చినా వదులుకోరు. తాజాగా ఐపీఎల్ ప్లేయర్ గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్ మ్యాచ్‌లో గుజరాత్ టీమ్‌లో వాషింగ్టన్ సుందర్‌ను ఆడించకపోవడంతో ఫ్యాన్స్ మండిపడుతున్నారు. కెప్టెన్ శుభమన్‌గిల్‌కు సోషల్ మీడియా వేదికగా ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఈ సందర్భంగా ఫ్యాన్స్ చర్చ మధ్యలో హఠాత్తుగా గూగుల్ సీఈవో ఇదే ప్రశ్న వేయడం క్రికెట్ అభిమానులను ఆశ్చర్యపరుస్తోంది. వాషింగ్టన్ సుందర్‌ను ఎందుకు ఆడించలేదని భారత్‌లోని అత్యుత్తమ 15 మంది ఆటగాళ్ల జాబితాలో అతడు చోటు దక్కించుకున్నారని, కానీ పది టీమ్‌లు ఉన్న ఐపీఎల్ ఫైనల్ 11లో మాత్రం అవకాశం దొరకకపోవడం మిస్టరీగా మారిందని ఒక అభిమాని పోస్ట్ పెట్టగా, నాకూ అదే ఆశ్చర్యంగా ఉందని గూగుల్ సీఈవో కూడా ప్రశ్నించారు. దీనితో ఈ పోస్టు వైరల్‌గా మారింది.
