Home Page SliderNews AlertTelangana

యాంకరింగ్‌కు సుమ గుడ్‌బై

యాంకర్‌ సుమ గురించి తెలియని తెలుగు ఫ్యాన్స్‌ ఉండరు. 15 ఏళ్లుగా స్టార్‌ యాంకర్‌గా బుల్లితెరపై సందడి చేస్తూ మంచి పేరును సంపాదించుకున్నారు. స్టార్‌ హీరోల ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌ అయినా, టాక్‌ షో అయినా సుమ ఉండాల్సిందే అనేంతగా క్రేజ్‌ దక్కించుకుంది. తాజాగా ఆమె అభిమానులకు షాకింగ్‌ న్యూస్‌ చెప్పింది. తాను యాంకరింగ్‌కు బ్రేక్‌ ఇస్తున్నట్లు చెప్పి ఎమోషనల్‌ అయింది. ఓ షోలో పాల్గొన్న సుమ.. నేను మలయాళీ అయిన తెలుగు ప్రేక్షకులు గుండెల్లో పెట్టుకొని ప్రేమించారు అంటూ ఆమె కన్నీటి పర్యంతమయింది. యాంకరింగ్‌ నుంచి విరామం తీసుకోబోతున్నట్లు స్వయంగా ప్రకటించడంతో మిగతా ఆర్టిస్టులు అందరూ ఆమెకు శాలువా కప్పి సన్మానం చేశారు. దీనికి సంబంధించిన ప్రోమో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది.