ఒరిస్సా రైలు ప్రమాద బాధితులకు సుఖేష్ 10 కోట్ల విరాళం
మనీలాండరింగ్, డ్రగ్స్ కేసులో తీహార్ జైలులో ఉన్న నిందితుడు సుఖేష్ చంద్రశేఖర్ ఒరిస్సా రైలు ప్రమాద బాధితులకు 10 కోట్ల రూపాయల సాయం ప్రకటించాడు. దీనితో ఖంగు తిన్నారు ప్రభుత్వ పెద్దలు. వందల కోట్ల రూపాయలు డ్రగ్స్, మనీ లాండరింగ్ కుంభకోణం కేసులో జైలులో ఉన్న సుఖేష్ తన విరాళాన్ని స్వీకరించమంటూ ఒరిస్సా ప్రభుత్వానికి లేఖ రాశాడు. దీనితో పాటు 10 కోట్ల రూపాయల చెక్కు కూడా పంపారు. ఈ చెక్కుతో పాటు తాను న్యాయంగా సంపాదించానంటూ ఐటీ రిటర్న్స్ కూడా పంపిచాడు. తన సంస్థలైన శారద ఫౌండేషన్, చంద్రశేఖర్ ఫౌండేషన్ కూడా పేదలకు, ఆపన్నులకు ఎల్లప్పుడూ సహాయం చేసేందుకు సిద్దంగా ఉంటుందని ఆ లేఖలో పేర్కొన్నాడు. దీనితో తర్జనభర్జనలు పడుతున్నారు.దిక్కుతోచక న్యాయసలహా కోరుతోంది కేంద్రప్రభుత్వం. ఖైదీగా ఉన్న వ్యక్తి విరాళం స్వీకరించవచ్చా అనేది సమస్యగా మారింది. గతంలో కూడా బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితపై మద్యం కుంభకోణంలో తనకు సంబంధం ఉందంటూ వాట్సాప్ ప్రచారం చేశాడు సుఖేష్.