కోటప్పకొండలో ఆత్మహత్య కలకలం
సుప్రసిద్ధ శైవ క్షేత్రమైన కోటప్పకొండలో ఆత్మహత్య కలకలం రేపింది. పల్నాడు జిల్లా కోటప్పకొండలో టీటీడీ వేద పాఠశాలలో ఓ విద్యార్థి బలవన్మరణానికి పాల్పడటం చర్చనీయాంశంగా మారింది.నిత్యం ఆథ్యాత్మిక వాతావణంతో ,మంత్రోచ్ఛారణల స్వరాలతో అలరారే వేదపాఠశాలకు చెందిన విద్యార్ధి హాస్టల్ గదిలో ఎవరూ లేని సమయం చూసి ఉరివేసుకుని చనిపోయాడు.ఏలూరు జిల్లా కైకలూరు మండలం భుజబల పట్నం గ్రామానికి చెందిన కుందుర్తి సాయి శివ సూరజ (16) వేదపాఠశాలలో అభ్యసిస్తున్నాడు.గత నాలుగేళ్ళ కిందట ఇక్కడ ప్రవేశం పొందాడు. ఉత్తమ విద్యార్ధికి పేరు తెచ్చుకున్నాడు.ఏమైందో ఏమో గానీ ఇలా ఆత్మహత్యకు పాల్పడ్డాడు.పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.మృతదేహాన్ని ఏరియా ప్రభుత్వాసుపత్రికి తరలించారు.కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.