చేనేత కార్మికుని ఆత్మహత్య
ఉపాధి కూలీ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన శుక్రవారం వెలుగు చూసింది. సిరిసిల్లలోని గాంధీనగర్ ప్రాంతానికి చెందిన దూస గణేష్ (50) అనే నేత కార్మికుడు గత ఏడాది నుంచి ఉపాధి లేక ఇబ్బంది పడుతున్నాడు.కుటుంబ పోషణ కోసం చేసిన అప్పులు పెనుభారం కావడంతో అప్పులు తీర్చలేక,కుటుంబాన్ని పోషించలేక మరణ వాంగ్మూలం రాసి మరీ చనిపోయాడు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన ఏడాది కాలంలో 30 మంది నేత కార్మికుల ఆత్మహత్య చేసుకున్నారని మృదేహాన్ని సందర్శించడానికి విచ్చేసిన బీఆర్ ఎస్ శ్రేణులు ఆరోపించారు.కాగా మృతునికి భార్య సువర్ణ ఇద్దరు ఆడపిల్లలు సుమశ్రీ, పూజితలు ఉన్నారు.


 
							 
							