కారులో ఆత్మహత్య
హైద్రాబాద్‌లోని వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఆత్మహత్య వెలుగు చూసింది . సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఇంజాపూర్ రాజశ్రీ ఎన్ క్లేవ్ లో నివసిస్తున్న ఉమాశ్రీ అనే మహిళ తన కారులో వనస్థలిపురం ప్రాంతానికి చేరుకుని కారుని సైడ్‌కి తీసి ఆత్మహత్యకు పాల్పడింది.పురుగుమందు సేవించి సూసైడ్ చేసుకుంది.అయితే ఎవరూ లేకపోవడంతో అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.భర్త రామకృష్ణారెడ్డితో కలిసి ఇదే అపార్ట్ మెంట్లో ఉంటుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో కారు డ్రైవ్ చేసుకుంటూ వచ్చి కారులోనే ఆత్మహత్యకు పాల్పడిందా లేదా ఎవరైనా బలవంతంగా పురుగు మందు తాగించి చంపేశారా అన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. మృతురాలి సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.


 
							