పెళ్లైన 40రోజులకే ఆత్మహత్య
లోన్ యాప్ నిర్వాహకుల వేధింపులు తాళలేక ఓ యువకుడు తనువు చాలించిన ఘటన విశాఖలో వెలుగు చూసింది. కేవలం రెండు వేల లోన్ అమౌంట్ చెల్లించలేదని, ఫోన్ చేస్తే రెస్పాండ్ అవ్వలేదనే కోపంతో ఓ రుణ వసూలుదారుడు విశాఖపట్నంలోని మహారాణపేట ప్రాంతానికి చెందిన నరేంద్ర(21) అనే తన కస్టమర్ ఫోటోని మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన నరేంద్ర సోమవారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.నరేంద్ర కు 40 రోజుల కిందటే వివాహం అయ్యింది.దీంతో ఆప్రాంతంలో విషాదఛాయలు అలముకున్నాయి. ఈ తరుణంలో లోన్ యాప్ నిర్వాహకులపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.నిందితులను అరెస్ట్ చేయాలని ఆందోళనకు దిగారు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.