బొగ్గు గనిలో అకస్మిక వరద..చిక్కుకున్న కార్మికులు
అస్సాంలోని దిమా హసావ్ జిల్లాలో బొగ్గు గనిలో తొమ్మిది మంది కార్మికులు పనిచేస్తుండగా హఠాత్తుగా గనిలో నీరు చేరింది. 100 అడుగుల మేర నీరు పెరుగుతోంది. దీనితో సహాయక చర్యలు ముమ్మరం చేశారు అధికారులు. ఇప్పటికే ముగ్గురు మృతి చెందారని, వారిలో ఒకరి మృతదేహాన్ని బయటకు తీసినట్లు పేర్కొన్నారు. సహాయక చర్యల కోసం విశాఖపట్నంలోని తూర్పు నౌకాదళానికి చెందిన డైవర్ల సహాయం కోరామని ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ వెల్లడించారు. వారు ఇప్పటికే పనిని ప్రారంభించారని పేర్కొన్నారు. గనిలోని నీటిని తోడేందుకు డీవాటరింగ్ పైపులు ఏర్పాట్లు చేస్తున్నారు. 340 అడుగుల లోతు ఉన్న గనిలో వారు పనిచేస్తున్నారు.