Home Page SliderNationalNews Alert

విద్యార్థుల బస్సు బోల్తా.. 15 మంది బాలికల దుర్మరణం

మణిపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.  నోనీ జిల్లా లాంగ్‌ సాయ్‌ వద్ద విద్యార్థుల బస్సు బోల్తా పడింది. ఈ ఘోర ప్రమాదంలో 15 మంది బాలికలు దుర్మరణం చెందారు. మరో 20 మంది గాయపడ్డారు. విద్యార్థులు విజ్ఞాన యాత్రకు వెళ్ళిన సందర్భంగా ఈ దుర్ఘటన జరిగింది. ఈ విద్యార్థులంతా యారిపోక్‌లో తంబాల్ను హయ్యర్‌ సెకండరీ స్కూలుకు చెందినవారు. ఎడ్యుకేషనల్‌ టూర్‌ నిమిత్తం రెండు బస్సుల్లో ఖౌపుమ్‌ వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం తెలుసుకున్న అధికారులు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని సహాయచర్యలు చేపట్టారు. గాయాలపాలైన వారికి చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.