ఏపీకి మొండి చెయ్యే..
ఈ ఏడాది బడ్జెట్‌లో ఏపీకి మొండిచెయ్యే మిగిలిందంటున్నారు ఆర్థిక నిపుణులు. ఎన్డీయే కూటమిలో భాగమైన ఏపీకి నిధులు రాకపోవడంతో ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. గతంలో అమరావతి కోసం అప్పులిప్పిస్తానని మాటిచ్చిన కేంద్రం, బిహార్‌కు మాత్రం ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా ఆర్థిక ప్యాకేజీలతో వరాల జల్లులు కురిపిస్తోంది. ఈ సారి బడ్జెట్‌లో కూడా వివక్ష చూపించింది. ఈ బడ్జెట్‌లో విశాఖ రైల్వేజోన్, అమరావతి, పోలవరం వంటి ఏ అంశాలూ ప్రస్తావనకు రాలేదు. తెలుగు కవి గురజాడ కవిత ‘దేశమంటే మట్టికాదోయ్.. దేశమంటే మనుషులోయ్’ అంటూ బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభించిన ఆర్థిక మంత్రికి తెలుగు రాష్ట్రాలు గుర్తుకురాకపోవడం విచారకరం.