Andhra PradeshHome Page Slider

పోరుబాట.. చంద్రబాబుకు బాసట

చింతపల్లి గ్రామీణం: తెలుగుదేశం పార్టీకి ప్రజల నుంచి వస్తున్న ఆదరణ చూసి వైకాపా ప్రభుత్వానికి ఓటమి భయం పట్టుకుందని, అందుకే కుట్రలు చేసి చంద్రబాబును జైలుకు పంపారని తెదేపా అరకు పార్లమెంట్ ‌కార్యనిర్వాహక కార్యదర్శి చల్లంగి జ్ఞానేశ్వరి ఆరోపించారు. గురువారం కొత్త వీధిలో బాబుతో నేనులో భాగంగా ఇంటింటికీ వెళ్లి వైకాపా అరాచక పాలనను వివరించారు. రాష్ట్రాభివృద్ధి చంద్రబాబుకే సాధ్యమని పేర్కొన్నారు. స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ కారణంగా వేలాది మందికి ఉద్యోగాలు లభించాయని చెప్పారు. వైకాపా పాలనలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, పెరిగిన నిత్యావసర సరకుల ధరలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. వైకాపా ప్రభుత్వానికి ఎన్నికల్లో బుద్ధి చెబుతామన్నారు. నాయకులు లకే చైతన్య, రాము, కోటేశ్వరరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.