వారిపై కఠిన నిర్ణయం తీసుకోవాలి..గంభీర్‌కు సీనియర్ సలహా
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ అనంతరం ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ జట్టు బలోపేతం విషయంలో కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవలసి ఉంటుందని సీనియర్ క్రికెట్ దిగ్గజం అనిల్ కుంబ్లే అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా సీనియర్ స్టార్ ప్లేయర్లు రోహిత్, విరాట్ కోహ్లి, జడేజా, షమీల విషయంలో సరైన నిర్ణయం తీసుకోవాలని, టీమ్‌ను యువకులతో కూడిన స్క్వాడ్‌గా తయారు చేయాలని పేర్కొన్నారు. స్టార్ ప్లేయర్ల వారసత్వాన్ని కొనసాగించాలంటే, వన్డే ప్రపంచకప్ 2027 మెగా టోర్నీకి సన్నాహాలు ప్రారంభించాలన్నారు. యువకులలో ప్రతీ ఒక్కరికీ కనీసం 20 మ్యాచ్‌లలో ఆడే అవకాశాలు కల్పించాలన్నారు. అప్పుడే పూర్తి స్థాయిలో అలవాటు పడగలరని పేర్కొన్నారు. రోహిత్, విరాట్ ఇప్పటికే టీ 20కి రిటైర్‌మెంట్ ప్రకటించారు. ఈ ట్రోఫీ తర్వాత వన్డేలకు కూడా వీడ్కోలు పలికితే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.