గ్రూప్ 1కి అడ్డు తగిలితే తీవ్ర చర్యలు..టీజీ డీజీపీ
తెలంగాణ గ్రూప్ 1 పరీక్ష యధావిథిగా జరుగుతుందని, ఈ పరీక్షకు అడ్డుపడితే తీవ్ర చర్యలుంటాయని తెలంగాణ డీజీపీ జితేందర్ హెచ్చరించారు. మెయిన్స్ పరీక్ష కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని, బందోబస్తు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. నిరసనల పేరుతో రోడ్ల మీదకు వచ్చి పబ్లిక్‌కు ఇబ్బందులు కలిగిస్తే ఉపేక్షించేది లేదన్నారు. పరీక్ష విషయంలో హైకోర్టు ఆదేశాలున్నాయని, అభ్యంతరాలుంటే సుప్రీంకోర్టుకు వెళ్లాలన్నారు.