Andhra PradeshHome Page Slider

“నాణ్యతలేని విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు”:ఏపీ సీఎం

ఏపీలో ఖరీఫ్ సీజన్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు ఖరీఫ్ సీజన్ కార్యచరణపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో చంద్రబాబు అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. కాగా రాష్ట్రంలో ఖరీఫ్ సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో అనుమతి లేని,నాసిరకం విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులకు ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా పంటల సాగులో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సీఎం తెలిపారు. అయితే రాష్ట్రంలో సహకార సంఘాల ద్వారా ఎరువుల పంపిణీకి ఏర్పాట్లు చేయాలని సీఎం వెల్లడించారు. కాగా ఈ ఖరీఫ్ సీజన్‌లో 4 లక్షల భూసార పరీక్షలు చేయాలని సీఎం చంద్రబాబు అధికారులకు సూచించారు.