గ్రూప్ 2 పరీక్షలలో విచిత్రం..భారీగా గైర్హాజరు
డిసెంబర్ 15 ఆదివారం జరిగిన తెలంగాణ గ్రూప్ 2 పరీక్షలలో విచిత్రంగా భారీగా అభ్యర్థులు గైర్హాజరయ్యారు. కనీసం 50 శాతం కూడా హాజరు కాలేదు. కేవలం 46.30 శాతం మాత్రమే హాజరయినట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. పేపర్ 1 పరీక్షకు 2,57,981 మంది, పేపర్ 2కు 2,55,490 మంది హాజరయ్యారు. సోమవారం ఉదయం జరిగిన పేపర్ 3 పరీక్షకు 45.62 శాతం మంది, మధ్యాహ్నం జరిగిన పేపర్ 4 పరీక్షకు 45.57 మంది హాజరయ్యారు. అయితే మొత్తంగా అన్ని పేపర్లలో కూడా సగం మంది కూడా అభ్యర్థులు హాజరుకాలేదు. ఈ పరీక్షలో ఏపీ చరిత్ర, తెలంగాణ ఉద్యమ చరిత్ర, కేంద్ర, రాష్ట్ర బడ్జెట్‌లు, రైతు బంధు, ఆసరా పింఛన్లు, మహాలక్ష్మి పథకం, ఉద్యమకారులు, రైతు ఉద్యమాలు, నిజాం పాలన వంటి అంశాలపై ప్రశ్నలు వచ్చాయని పేర్కొన్నారు. ఈ పరీక్ష ఫలితాలు త్వరలోనే వెల్లడి కానున్నాయని అధికారులు పేర్కొన్నారు.

