NationalNews

లాభాల్లో స్టాక్ మార్కెట్లు

ఈ రోజు ఆరంభం నుంచి స్టాక్ మార్కెట్లు లాభాలతో దూసుకుపోతున్నాయి. ఈ మేరకు ఈ రోజు 400 పాయింట్లకు పైగా లాభాలతో సెన్సెక్స్ విజయపథంలో నడుస్తుంది. అంతేకాకుండా 120 పాయింట్లకు పైగా లాభాలతో నిఫ్టీ కొనసాగుతుంది. దీంతో ఈ రోజు మార్కెట్ ట్రేడింగ్ జోరుగా సాగుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల వరుస నష్టాలతో కొనసాగిన సెన్సెక్స్ ఈ రోజు లాభాల బాట పట్టడంతో దేశీయ మార్కెట్లు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఇదే విధంగా సెన్సెక్స్ వరుస లాభాల్లో సాగితే ఇంతకుముందు నష్టాల నుంచి త్వరగా కోలుకోవచ్చని దేశియ స్టాక్ మార్కెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.