News

5 లక్షల కోట్లు హాంఫట్

అమెరికా ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు అంశం… భారత స్టాక్ మార్కెట్లను దెబ్బతీశాయ్. ఆర్థిక సంక్షోభం రాబోతుందన్న సంకేతాలు ప్రపంచ మార్కెట్లపై పెను ప్రభావం చూపించాయ్.
సెన్సెక్స్, నిఫ్టీ ఏడాది కనిష్ట స్థాయికి చేరుకున్నాయ్. వరుసగా ఐదో రోజు కూడా భారీగా నష్టపోయాయి. ఇన్వెస్టర్ల 5 లక్షల కోట్ల సంపద ఆవిరైంది. ఉదయం మార్కెట్లు
లాభాలతో ప్రారంభమైనా… తర్వాత నష్టాల్లోకి జారుకున్నాయ్… అన్ని రంగాల షేర్లు నష్టపోగా… రూపాయి మాత్రం 10 పైసలు కోలుకొని రూ. 78.10 పైసల వద్ద
కొనసాగుతోంది. 1994 నుండి US ఫెడరల్ రిజర్వ్… భారీగా వడ్డీ రేట్లను పెంచడంతో ఒక్కసారిగా అందరూ షాక్ అయ్యారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై దాని ప్రభావంపై
పెట్టుబడిదారులు భిన్నా అభిప్రాయాలతో గందరగోళం నెలకొంది. బుధవారం సెన్సెక్స్ 52,541.39 వద్ద, ఎన్‌ఎస్‌ఈ 15,692.15 పాయింట్ల వద్ద ముగిశాయి. మేజర్ షేర్లు రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్‌డిఎఫ్‌సి ట్విన్స్ భారీగా క్షీణించాయ్. టాటా స్టీల్, టెక్ మహీంద్రా, ఇండస్ఇండ్ బ్యాంక్, విప్రో, భారతీ ఎయిర్‌టెల్, బజాజ్ ఫైనాన్స్, కోటక్ మహీంద్రా బ్యాంక్, NTPC అమ్మకాల ఒత్తిడితో షేర్లు భారీగా నష్టపోయాయ్. నెస్లే ఇండియా మాత్రమే లాభపడింది. మార్కెట్లు బుధవారం ఫెడ్ యొక్క 75 బేసిస్ పాయింట్ల పెంపును ఊహించాయి మరియు గత వారం ఆశ్చర్యకరంగా వేడిగా ఉన్న ద్రవ్యోల్బణం పఠనం తర్వాత అనేక ధరలలో ధరలను అంచనా వేసింది. జూన్‌లో ఇప్పటివరకు రూ. 24,949 కోట్ల విదేశీ పెట్టబడులు వెనక్కివెళ్లిపోయాయ్. ఏడాదిగా లక్షా 92 వేల కోట్ల ఈక్విటీలను ఫారెన్ ఇన్వెస్టర్లు అమ్మకాలు జరిపడం… మార్కెట్‌లో ఆందోళన నెలకొంది.