స్టీల్‌ప్లాంట్ కార్మికుల సమ్మె సైరన్
విశాఖ స్టీల్‌ప్లాంట్ కార్మికుల యుద్ధం ఇంకా ముగిసిపోలేదు. మరోసారి స్టీల్‌ప్లాంట్ భారీగా కాంట్రాక్ట్ ఉద్యోగులను తొలగించడంతో సమ్మె సైరన్ మ్రోగించారు. ఇటీవల 1500 మందిని, గతంలో 1000 మందిని తొలగించారు. తాజాగా మరో 4500 మందిని తొలగించాలని యాజమాన్యం ప్రణాళిక సిద్ధం చేసినట్లు సమాచారం అందడంతో కార్మికులు ఆందోళనకు గురయ్యారు. రాష్ట్రప్రభుత్వం స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకోవాలని, తమకు రాజకీయ పార్టీలు కూడా మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు కార్మిక నాయకులు. దాదాపు 14 వేల మంది సమ్మెలో పాల్గొననున్నారు. రేపు కూర్మన్నపాలెంలో రాస్తారోకో చేపట్టాలని నిర్ణయించారు. ఈ నెల 16 నుండి నిరవధిక సమ్మెకు దిగనున్నారు. ఈసారి యాజమాన్యం దిగివచ్చేవరకూ సమ్మె చేయాలని నిర్ణయించారు.

