న్యూయార్క్‌లో అత్యవసర స్థితి..వేగంగా వ్యాపిస్తున్న కార్చిచ్చు..
అమెరికాలో ఏదో మూల కార్చిచ్చు కమ్మేస్తూనే ఉంటుంది. ఇటీవల లాస్ ఏంజెల్స్‌ను కబళించిన కార్చిచ్చు తాజాగా న్యూయార్క్ నగరానికి సమీపంలో అంటుకుంది. దీనితో న్యూయార్క్ గవర్నర్ అత్యవసర స్థితి ప్రకటించారు. శనివారం లాంగ్ ఐలాండ్‌లోని హోంప్టన్స్‌లో మంటలు చెలరేగి, న్యూయార్క్ నగరాన్ని కూడా పొగ చుట్టుముట్టింది. తీవ్రమైన గాలుల కారణంగా దట్టమైన పొగ వ్యాపించి, ఆకాశమంతా కమ్ముకుంది. దీనితో ప్రధాన రహదారులను అధికారులు మూసివేశారు. హోంప్టన్స్‌లో నాలుగు చోట్ల మంటలు వ్యాపించినట్లు చెప్తున్నారు. ఈ కారణంగా రెండు వాణిజ్య భవనాలు కాలిపోయాయి. మంటలను అదుపు చేసేందుకు హెలికాప్టర్లతో నీటిని చల్లుతున్నారు. ముందుజాగ్రత్తగా స్థానికులను ఆ ప్రాంతం నుండి తరలిస్తున్నారు.

