Home Page SlidermoviesNews Alert

స్టార్ హీరోయిన్‌పై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్..

వరుస విజయాలు సాధిస్తూ దూసుకుపోతున్న స్టార్ హీరోయిన్ రష్మికపై కర్ణాటక రాష్ట్రప్రభుత్వం సీరియస్ అయ్యింది. బెంగళూరు వేదికగా జరుగుతున్న అంతర్జాతీయ చలన చిత్రోత్సవ ప్రారంభ కార్యక్రమానికి ఆమె హాజరు కాకపోవడంతోనే ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో జరిగిన కీలక కార్యక్రమాలకు నటీనటులు, దర్శక నిర్మాతలు  పాల్గొనాలని, లేకపోతే ఈ చలన చిత్రోత్సవాల వల్ల లాభమేముందని ప్రశ్నించారు. మండ్యాకు చెందిన ఎమ్మెల్యే రవి గనిగ కూడా రష్మికపై సంచలన ఆరోపణలు చేశారు. ఆమెకు గుణపాఠం చెప్పాలన్నారు. ఆమెను ఈ కార్యక్రమానికి ఆహ్వానించగా, తనకు సమయం లేదని చెప్పినట్లు చెప్పారు. కర్ణాటక ఎక్కడో నాకు తెలియదు, మా ఇల్లు హైదరాబాద్‌లో ఉందని చెప్పినట్లు పేర్కొన్నారు. ఆమె కన్నడ చిత్ర పరిశ్రమ, భాష పట్ల అగౌరవంగా వ్యవహరిస్తున్నారు. అంటూ మండిపడ్డారు.