దేశంలో స్టార్టప్‌లు 40 లక్షల ఉద్యోగాలను సృష్టించాయి: మోదీ
భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు “రోజ్ గార్ మేళా”లో పాల్గొన్నారు. దీనిలో భాగంగా ఆయన ఇవాళ 71 వేలమందికి నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా దేశంలో ఉన్న ఉద్యోగ అవకాశాలను గురించి మోదీ ప్రసంగించారు. కాగా ప్రధాని మోదీ మాట్లాడుతూ..నేటి భారతం సరికొత్త విధానాలు,వ్యూహాలతో ముందుకు సాగుతోందన్నారు. దీనివల్లే దేశంలో కొత్త ఉద్యోగ అవకాశాలకు ద్వారాలు తెరుచుకున్నాయన్నారు. అంతేకాకుండా దేశంలో స్టార్టప్‌లు 40 లక్షలకు పైగా ఉద్యోగాలు సృష్టించాయని ప్రధాని పేర్కొన్నారు. కాగా దేశంలో బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన “ముద్రా” పథకం లక్షలాదిమంది జీవితాల్లో వెలుగులు నింపి..వారిని పారిశ్రామికవేత్తలుగా మార్చిందన్నారు.