డేటింగ్ నేర్పిస్తున్న స్టార్ హీరో
డేటింగ్ ఎలా చేయాలో కొడుక్కి నేర్పిస్తున్న స్టార్ హీరో.. టాలీవుడ్లో విలన్‌గా నటిస్తూ సైఫ్ అలీఖాన్ ఒక ఒరవడిని సృష్టించారు. ఆదిపురుష్‌లో రావణుడి పాత్రలో నటించారు. ఇప్పుడు ఎన్టీఆర్ దేవరలోను అతడు కీలక పాత్రలో నటించడం ఆసక్తిని రేకెత్తించింది. సైఫ్ తెలుగు సినిమాలతో పాటు జాతీయ మీడియా ఇంటర్వ్యూల్లోను పలు ఆసక్తికర విషయాలు చెబుతున్నారు. ఒక ఇంగ్లీష్ పేపర్లో ఇటీవలి ఇంటర్వ్యూలో సైఫ్ అలీ ఖాన్ తన ఫ్యామిలీ, పిల్లల గురించి మాట్లాడిన విషయాలు హైలైట్ అయ్యాయి. తన పిల్లల్ని నటులవ్వాలని ఎటువంటి ఒత్తిడి చేయలేదని సైఫ్ అన్నారు. వారికి నచ్చిన విధంగా సంతోషంగా మీకు మీరుగా ఉండవచ్చని సైఫ్ స్వేచ్ఛను ఇచ్చానని తెలిపారు. తన వారసులు ఇబ్రహీం అలీఖాన్, సారా అలీఖాన్ గురించి మాట్లాడారు, వారంతా ఇప్పటికే సినీ పరిశ్రమలో చేరిపోయారు.
తైమూర్ అలీఖాన్ గురించి సైఫ్‌ఖాన్ ఒక ఇంట్రస్టింగ్ విషయాన్ని చెప్పారు. ప్రజల ముందు అన్ని నిజాలు చెప్పడానికి నేను భయపడతాను. కానీ ఇప్పుడు థైమూర్ తన స్కూల్లో ఆటల మీద కాన్సెంట్రేషన్ చేస్తున్నాడు. తన చిన్న కుమారుడు జెహ్ అలీఖాన్ గురించి చెబుతూ.. చిన్నవాడు పుట్టుకతోనే మంచి పెర్ఫార్మర్.. అతడికి ఆ నైపుణ్యం ఎక్కడ నుండి వచ్చిందో నాకు తెలుసు అని వ్యాఖ్యానించారు. సైఫ్ అలీఖాన్ తన పిల్లలతో స్పెండ్ చేయడం గురించి కూడా మాట్లాడారు. ఇబ్రహీం అలీఖాన్ ఇటీవల తనను అమ్మాయిల ప్రేమ వ్యవహారం గురించి అడిగాడట. అతనికి సమాధానం ఇచ్చే ముందు కొంత ఆలోచించానని సైఫ్ అన్నారు. “ఒక నిర్దిష్ట దశలో తన సంబంధాన్ని ఎంత సీరియస్‌గా తీసుకోవాలో సైఫ్ కొడుక్కి వివరాలతో సహా చెప్పారట. తన సంబంధాన్ని అన్ని సమయాల్లో సీరియస్‌గా తీసుకోవడం చాలా అవసరమని చెప్పాడు. ఇబ్రహీం తన నటన గురించి.. గర్ల్స్‌తో ప్రేమ సంబంధాల గురించి స్పష్ఠంగా తన తండ్రితో మాట్లాడారు. సారా అలీఖాన్ తన వృత్తి గురించి సలహాలు అడిగి తెలుసుకుందిట. ఎన్టీఆర్- సైఫ్ అలీఖాన్ నటించిన పాన్ ఇండియా చిత్రం `దేవర: పార్ట్ 1` ఈరోజు 27 సెప్టెంబర్ థియేటర్లలో విడుదలైంది. జాన్వీ కపూర్, ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, షైన్ టామ్ చాకో తదితరులు ఇందులో నటించారు. ఈ చిత్రానికి కొరటాల శివ డైరెక్షన్ చేశారు.

