Andhra PradeshHome Page Slider

Complete Report: రాజకీయం కోసం తిరుమలను వాడుకుంటావా?

తిరుపతి లడ్డూలకు సంబంధించి ఆరోపణలు పూర్తి నిరాధారమైనవని వైసీపీ అధినేత జగన్ పేర్కొన్నారు. టీడీపీ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని ఆయన మండిపడ్డారు. బుధవారం వివాదం చెలరేగిన తర్వాత మొదటిసారి జగన్ మాట్లాడారు. లడ్డూలకు సంబంధించి వచ్చిన ఆరోపణలను ఆయన ఖండించారు. టీడీపీ రిలీజ్ చేసిన రిపోర్ట్ “తప్పుడు నివేదిక” అంటూ మండిపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజకీయాల కోసం దేవుడ్ని వాడుకుంటున్నారని దుయ్యబట్టారు. చంద్రబాబు అబద్ధాలకు రెక్కలుకడుతున్నారని, కోట్లాది మంది భక్తుల విశ్వాసాలతో ఆడుకుంటున్నారని విమర్శించారు. ప్రభుత్వ వైఫల్యాలను కప్పపించుకునేందుకు ఇలాంటి దిక్కుమాలిన విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రపంచ చరిత్ర కలిగిన టీటీడీ పరువు తీస్తారా అంటూ మండిపడ్డారు. మొత్తం వ్యవహారంపై ప్రధానికి, సుప్రీం కోర్టు సీజేఐకి లేఖ రాస్తానని జగన్ చెప్పారు.

మరోవైపు జంతువుల కొవ్వు-నెయ్యి-తిరుపతి లడ్డూ వివాదం సుప్రీంకోర్టుకు చేరుకుంది. రాజ్యాంగంలోని మతస్వేచ్ఛకు హామీ ఇచ్చే ఆర్టికల్ 25 ఉల్లంఘిన జరిగిందని పిటిషన్‌దారు ఆరోపించారు. మొత్తం వ్యవహారం ప్రాథమిక హిందూ మతపరమైన ఆచారాలను ఉల్లంఘిస్తోందని, ‘ప్రసాదం’గా భావించే అసంఖ్యాక భక్తుల మనోభావాలను తీవ్రంగా గాయపరిచిందని ఆరోపిస్తూ న్యాయవాది న్యాయవాది సత్యం సింగ్ పిటిషన్ దాఖలు చేశారు. లడ్డూలలో జంతువుల కొవ్వు ఉన్నట్లు ఆరోపించిన పిటిషనర్, ఆలయ నిర్వహణలో పెద్ద వ్యవస్థాగత సమస్యలకు లక్షణమని… హిందూ మతపరమైన ఆచారాల పవిత్రతను సుప్రీంకోర్టు కాపాడాలని కోరారు. టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న ఆలయంలోని ప్రసాదంపై వచ్చిన ఆరోపణలు భక్తుల మనోభావాలను దెబ్బతీశాయని, జంతువులను వినియోగిస్తున్నారని ఆరోపిస్తున్నారని భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్‌కు పంపిన లేఖలో న్యాయవాది సత్యం సింగ్ పేర్కొన్నారు. లడ్డూలలోని కొవ్వు అంశం, రాజ్యాంగంలోని ఆర్టికల్ 25ను ఉల్లంఘిస్తుందని, మత స్వేచ్ఛకు హాని కలిగిస్తోందని అన్నారు. హిందూ మతపరమైన ఆచారాలను పరిరక్షించాలని, పవిత్రమైన సంస్థల నిర్వహణను సక్రమంగా నిర్వహించాలని కోరుతూ, ఈ విషయంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలని కోరారు.

తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో తిరుపతి లడ్డూల తయారీకి జంతువుల కొవ్వు, చేప నూనె, బీఫ్ టాలో, పందికొవ్వును ఉపయోగించారనే ఆరోపణలపై కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పూర్తి నివేదికను కోరింది. కేంద్ర ఆహార మంత్రి ప్రహ్లాద్ జోషి వివరణాత్మక విచారణకు పిలుపునిచ్చారు. దోషిని శిక్షించాలని విలేకరులతో అన్నారు. నెయ్యి సరఫరాదారు ఆహార పరీక్ష సౌకర్యాల లేక అక్రమాలకు పాల్పడ్డారన్నారు. టీటీడీ ఈవో శ్యామలరావు మాట్లాడుతూ పరీక్షా సౌకర్యాలు లేకపోవడం వల్ల, సాధారణ నాణ్యత తనిఖీలను నిర్వహించలేదన్నారు. తిరుపతి నుంచి వచ్చిన నెయ్యి శాంపిల్స్‌లో చేపనూనె, బీఫ్ టాలో, పందికొవ్వు ఉన్నట్లు పరీక్షల్లో పాజిటివ్‌గా తేలినట్లు గుజరాత్‌లోని ప్రభుత్వ ఆధ్వర్యంలోని ల్యాబ్ నుండి జూలై 17న వచ్చిన నివేదికను టీడీపీ చేసిన వ్యాఖ్యలతో కలకలం రేగింది.

‘‘తిరుపతి లడ్డూ కూడా నాసిరకం పదార్థాలతో తయారైంది.. నెయ్యికి బదులు జంతువుల కొవ్వును వాడారు’’ అని ముందురోజు అమరావతిలో జరిగిన శాసనసభా పక్ష సమావేశంలో ముఖ్యమంత్రి విరుచుకుపడ్డారు. అప్పటి నుంచి తమ ప్రభుత్వం నెయ్యితో సహా అధిక నాణ్యతతో కూడిన పదార్థాలను అందించిందని ఆయన అన్నారు. ఆలయ ప్రాంగణాన్ని కూడా “శానిటైజ్” చేశామన్నారు. ఆలయంలో లడ్డూలు, ఉచిత భోజనం చేసేందుకు ఉపయోగించే నెయ్యి, కూరగాయల కొనుగోలులో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై అవినీతి నిరోధక శాఖ విచారణ చేపట్టడం వల్లే ఈ దుమారం రేగిందని చంద్రబాబు కుమారుడు, ఆంధ్రా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. జనసేన పార్టీ అధినేత, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ “సనాతనధర్మం” అపవిత్రం” చేశారన్నారు. ఈ ఆరోపణలపై వైసీపీ ధీటుగా ఎదురుదాడి చేసింది. తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ ఛైర్‌పర్సన్, రాజ్యసభ ఎంపీ వైవీ సుబ్బా రెడ్డి మాట్లాడుతూ.. దేవుడికి ప్రతిరోజు సమర్పించే ఆహారంలో జంతువుల కొవ్వును వాడినట్లు చెప్పడం కూడా ఊహించలేని విషయమని ఆలయ నిర్వహణ ప్రభుత్వ ఆధ్వర్యంలోని ట్రస్ట్‌కు చెందినదని చెప్పారు. రాజకీయ కుట్రలో భాగంగా ఈ ప్రచారమన్నారు రెండుసార్లు టీటీడీ చైర్‌పర్సన్‌గా చేసిన భూమన కరుణాకర్‌రెడ్డి చెప్పారు.

మొత్తం వ్యవహారంపై టీడీపీ, జనసేనతో పొత్తు పెట్టుకున్న భారతీయ జనతా పార్టీ కూడా ఉలిక్కిపడింది. కేంద్ర మంత్రి, జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ “చాలా పవిత్రమైన ప్రసాదం”కు వ్యతిరేకంగా “క్షమించరాని పాపం” అని నిందించారు. నెయ్యి సమస్య ఇతర మతాలకు చెందిన వారిని కొంతమంది బోర్డులోకి ప్రవేశించారని కూడా ఆయన ఆరోపించారు. అదే సమయంలో, కాంగ్రెస్ చాలా నిశ్శబ్దంగా ఉంది. జంతువుల కొవ్వు ఆరోపణలపై సీబీఐ విచారణ జరిపించాలని ఆ పార్టీ ఆంధ్రప్రదేశ్‌ చీఫ్‌ వైఎస్‌ షర్మిల డిమాండ్‌ చేశారు. తిరుమల ఆలయ వంటగదిలో ప్రతిరోజూ సుమారు 1,400 కిలోల నెయ్యి అధిక మొత్తంలో జీడిపప్పులు, ఎండుద్రాక్షలు, యాలకులు, శెనగపిండి, పంచదార వంటి వాటితో దాదాపు మూడు లక్షల లడ్డూలను తయారు చేస్తారు. తమిళనాడులోని దిండిగల్‌లోని ఒక సరఫరాదారు నుండి నెయ్యిని కొనుగోలు చేసినట్లు నివేదికలు సూచిస్తున్నాయి.