AI టెక్నాలజీతో శ్రీవారి దర్శనం
శ్రీవారి సేవలు ఇప్పటి వరకు అంతర్జాతీయంగా లభిస్తున్నాయి.ఇక నుంచి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అన్నీ అగ్ర దేశాల్లో అదేవిధంగా అరబ్ ఎమిరేట్స్ లాంటి హైందవ అనుసరణ దేశాల్లోని భక్తులకు సైతం సరళతరం అయ్యేలా నూతన ఒరవడికి శ్రీకారం చుట్టింది టిటిడి.ఇందుకోసం ప్రపంచాన్ని అబ్బురపరుస్తున్న AI టెక్నాలజీని టిటిడి సేవల్లో చొప్పించనున్నారు. ఏఐ సాంకేతికతతో తక్కువ సమయంలో భక్తులకు శ్రీవారి దర్శనం కల్పించే విషయంలో టిటిడి ప్రయోగాత్మక ప్రాజెక్టు చేపట్టింది.దీని కోసం తొలుత మూడు సంస్థలు అధ్యయనానికి ముందుకొచ్చాయి. ఇది పూర్తి కావడానికి మూడు నెలలు సమయం పడుతుందని ధర్మకర్తల మండలి ఛైర్మన్ బీ.ఆర్. నాయుడు తెలిపారు. ఇకనుంచి తిరుమల తిరుపతి దేవస్థానం కార్యక్రమాలను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లేలా చర్యలు చేపట్టనున్నట్లు వివరించారు. ఇందుకోసం ఒక కమిటీని వేయనున్నామన్నారు. AI టెక్నాలజీ టిటిడి సేవల్లో ప్రయోగాత్మకంగా ప్రవేశపెడితే మల్టిపుల్ చెకింగ్స్,బిజీ క్యూ లైన్స్ ఇంకా ఎన్నో బాధల నుంచి తప్పించుకోవచ్చు.