స్కూల్ బాత్‌రూంలో స్పైకెమెరా..స్కూల్ డైరక్టర్ అరెస్ట్
నోయిడాలోని ఒక ప్లేస్కూల్‌లో బాత్‌రూమ్‌లో స్పైకెమెరా గుర్తించిన ఒక టీచర్ ఇచ్చిన ఫిర్యాదుతో స్కూల్ డైరక్టర్‌ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. వాష్‌రూంలో ఉండే బల్బు హోల్డర్‌లో ఏదో ఉన్నట్లు కనిపెట్టిన టీచర్ ఈ స్పైకెమెరాను వెలికితీశారు. ఈ విషయంపై ఆమె స్కూల్ డైరక్టర్ నవీష్ సహాయ్‌కు సమాచారం ఇచ్చారు. కానీ ఆయన ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో సెక్యూరిటీ గార్డుతో మాట్లాడగా, సాక్షాత్తూ డైరక్టర్ నవీషే ఆ కెమెరాను ఏర్పాటు చేసినట్లు తెలిసింది. గతంలో కూడా అమె ఇలాంటి కెమెరాను స్కూల్‌లోనే కనిపెట్టినట్లు చెప్పారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనలో దర్యాప్తు చేసిన పోలీసులకు డైరక్టర్ ఈ కెమెరాను ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసినట్లు తెలిసింది. దీనితో డైరక్టర్‌ను అరెస్టు చేసి కేసు నమోదు చేశారు.