Home Page SliderNews AlertTelangana

యువశక్తి ఆరోగ్యంగా ఉండాలంటే క్రీడలు అవసరం..

ప్రపంచంలో అతి ఎక్కువ యువశక్తి ఉన్న దేశం భారతదేశం… ఈ యువశక్తి ఆరోగ్యంగా ఉండాలంటే క్రీడలు అవసరమన్నారు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ పేర్కొన్నారు. భారతీయ జనతా పార్టీ యువమోర్చా (BJYM) ఆధ్వర్యంలో మేడ్చల్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నమెంట్ కార్యక్రమంలో ఈటల రాజేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… అనేక రకాలుగా యువత పెడ దోవలు పడుతున్న సందర్భంలో క్రీడలో నిర్వహించడం ద్వారా.. ఆ స్పిరిట్ ను, ఆ కమిట్మెంట్ ని యువత అంతా ఆచరణ చేయాలని కోరుతున్నానని అన్నారు. దీనిని మరింత విస్తరించుకొని ఎక్కువ మంది యువత క్రీడలలో పాల్గొనేలా చేయాలన్నారు.  అటల్ బిహారి వాజ్‌పేయి సంస్మరణ జరుపుకుంటున్న ఈ టోర్నమెంట్స్ ప్రతి సంవత్సరం నిర్వహించాలన్నారు ఈటల రాజేందర్.