Home Page SliderNews

మమతాపై వ్యాఖ్యలు చేసినందుకు బెంగాల్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి అరెస్ట్

బెంగాల్ సీఎం మమతా బెనర్జీపై చేసిన వ్యాఖ్యలకు గాను… పశ్చిమ బెంగాల్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి కౌస్తవ్ బాగ్చీని పోలీసులు శనివారం ఉదయం అరెస్టు చేశారు. పశ్చిమ బెంగాల్‌లోని నార్త్ 24 పరగణాస్ జిల్లాలోని బారక్‌పూర్‌లోని బాగ్చి నివాసంపై బర్టోల్లా పోలీస్ స్టేషన్‌కు చెందిన భారీ బృందం తెల్లవారుజామున 3.30 గంటలకు దాడి చేసి అరెస్టు చేసింది. సీఎం మమత బెనర్జీకి వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలపై శుక్రవారం బర్టోల్లా పోలీస్ స్టేషన్‌లో బాగ్చీపై ఫిర్యాదు నమోదైంది. “బరాక్‌పూర్‌లోని అతని నివాసం నుండి కౌస్తవ్ బాగ్చీని అరెస్టు చేసాం. దీని గురించి పెద్దగా మాట్లాడలేం. మా అధికారులు అతనితో మాట్లాడుతున్నారు” అని పోలీస్ అధికారి పిటిఐకి చెప్పారు. సాగర్‌డిగి ఉపఎన్నికలలో కాంగ్రెస్ విజయం తర్వాత పశ్చిమ బెంగాల్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు అధీర్ రంజన్ చౌదరిపై మమత చేసిన వ్యాఖ్యలకు బాగ్చీ తీవ్రంగా స్పందించాడు. ఐతే అరెస్టు తర్వాత, పార్టీ కార్యకర్తలు పోలీసు స్టేషన్ వెలుపల నిరసన ప్రదర్శన చేసినప్పటికీ, బాగ్చీని బుర్టోల్లా పోలీస్ స్టేషన్‌కు తరలించారు. IPCలోని 120(B) నేరపూరిత కుట్ర, 504 శాంతి భంగం కలిగించే ఉద్దేశ్యంతో ఉద్దేశ్యపూర్వకంగా అవమానించడం, 506 నేరపూరిత బెదిరింపు, ఇతర సెక్షన్ల కింద బాగ్చీపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.